సూర్యాపేట జిల్లా: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు స్వతంత్ర దినోత్సవ పరేడ్ ప్రాక్టీస్ ను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పరిశీలించి,సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వేడుకలకు వచ్చే పౌరులకు ఎలాంటి అవసరం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
స్వతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ కమాండర్ గా జిల్లా ఆర్మూడ్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి వ్యవహరించనున్నారు.ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్ధన్ రెడ్డి,ఏఆర్ అడ్మిన్ ఆర్ఐ నారాయణరాజు,పరేడ్ సిబ్బంది పాల్గొన్నారు.