పచ్చిపాలు తాగే అలవాటు ఉందా.. దీని వల్ల కలిగే నష్టాలివే..

సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజూ ఒక గ్లాసు పాలు తాగాలని డాక్టర్లతో పాటు పెద్దలు కూడా చెబుతుంటారు.కొందరైతే జస్ట్ పాలు తాగి జీవిస్తుంటారు.

 Do You Have A Habit Of Drinking Raw Milk,raw Milk,viral Latest News , Viral News-TeluguStop.com

ఎందుకంటే పాలలో శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయని నమ్ముతారు.రాత్రిపూట ఏం భోజనం లేనప్పుడు గ్లాస్ పాలు తాగినా చాలు ఆకలి తీరుతుంది.

అయితే పాలు ఎలా తాగాలి? పచ్చివి తాగాలా లేదా బాగా వేడి చేసి తాగాలా? అనే ఒక సందేహం చాలా మందిలో ఉంటుంది.మరి ఈ రెండిటిలో ఏది ఉత్తమం? ఏది హానికరం? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కసారి కూడా వేడి చేయని పచ్చి పాలు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అమెరికా ఆరోగ్య శాఖకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, పచ్చిపాలలో హాని తలపెట్టే బ్యాడ్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది.

పచ్చిపాలలో ఎక్కువగా కనిపించే ఈకోలి, లిస్టేరియా, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉదర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.అంతేకాదు, పచ్చి పాలలోని ఈ బ్యాక్టీరియా అనేది ఫుడ్ పాయిజన్‌కి కూడా దారితీసే ప్రమాదాలు ఎక్కువ.

ఈ బాక్టీరియా శరీరానికి మంచి చేకూర్చడం అటుంచితే కీడు చేస్తుంది.

Telugu Raw Milk, Tips, Healthy, Latest-Latest News - Telugu

పచ్చి పాలు తాగడం వల్ల డయేరియా, డీ హైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తినట్లు గత అధ్యయనంలో తేలింది.అంతేకాదు పాలను పచ్చిగా తాగితే శరీరంలో యాసిడ్ స్థాయి కూడా రెట్టింపవుతుంది.సాధారణంగా పాలు తీసేటప్పుడు ఆ జంతువుల పొదుగుపై రకరకాల క్రీములు పేరుకుపోతాయి.

పాలు తీసే వ్యక్తుల చేతులు, పరిసరాలు, గిన్నెలో సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఉంది.అయితే పాలను వేడి చేయడం వల్ల ఈ క్రీములన్నీ చనిపోతాయి.అప్పుడు వేడి చేసిన పాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి.అలా కాదని పచ్చి పాలు తాగితే ఆరోగ్య సమస్యల బారిన పడక తప్పదు.

డాక్టర్ల ప్రకారం పాలను బాగా మరగబెట్టిన చల్లార్చిన తర్వాత తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube