సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండలం మోదిన్ పురం గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది సగరపు ప్రసాద్,వివిధ పార్టీలకు చెందిన 600 మంది కార్యకర్తలతో బుధవారం ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేణారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కడువా కాప్పి సాదరంగా ఆహ్వానించారు.
అంతకుముందు మోదీన్ పురం నుండి నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్లు, ఆటోలు,మోటార్ సైకిళ్లపై భారీ ర్యాలీతో జిల్లా కేంద్రంలోని రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉన్నత చదువులు చదివిన యువతకు పెద్ద పీట వేస్తుందన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో ఎంతోమంది యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ప్రోత్సాహించాలని గుర్తు చేశారు.
మహిళలకు కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.పార్టీలో పాత నాయకులను ఐక్యం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సగర ప్రసాద్ కు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.పార్టీ బలోపేతం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.
యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో యువత భారీగా సభ్యత్వాలు తీసుకొని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఎలిమినేటి అభినయం భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్, చత్రు నాయక్,నాయకులు కొడితల వెంకన్న, బోళ్ల రమణమ్మ,మస్తాన్,కన్నం జానయ్య,ఎల్లాచారి,చెరుకు సుధాకర్,చీమ వీరయ్య,చీమ సుధాకర్, భూక్య సైదా,పరిశయ్య, చిన్న వెంకన్న,శాంతి, నాగరాణితో తోపాటు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.