తెలంగాణలో పాలన లేదు కాబట్టే పార్టీ పెట్టాం:షర్మిల

కేసీఆర్ పాలన మరిచి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు కట్టిస్తాం.

 We Named The Party Because There Is No Rule In Telangana: Sharmila-TeluguStop.com

వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే మా ధ్యేయం.-వైఎస్ షర్మిల.

సూర్యాపేట జిల్లా:వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో 99 రోజులు ముగించుకొని 100 వ, రోజు సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించింది.నేలకొండపల్లి మండలం నుండి కోదాడ నియోజకవర్గంలోని అనంతగిరి మండలంలోకి చేరుకున్న మహాప్రస్థాన పాదయాత్ర శాంతినగర్ గ్రామం నుంచి 100వ రోజు ప్రారంభమైనది.

ఈ సందర్భంగా ఆమెకు వైఎస్ఆర్ అభిమానులు,మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.శాంతినగర్ గ్రామంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన లేదు కాబట్టే పార్టీ పెట్టామని అన్నారు.వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే మా ధ్యేయమని ప్రకటించారు.వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా ఉందని, కులాలకు,మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్సార్ ఆదుకున్నారని,వైఎస్సార్ ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారని గుర్తు చేశారు.8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు.డబుల్ బెడ్ రూం అని మోసం,మూడు ఎకరాల భూమి అని మోసం,ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు.మీరు ఆశీర్వదించండి వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తా,ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు కట్టి ఇస్తా అని హామీ ఇచ్చారు.

సాయంత్రానికి కోదాడ చేరుకున్న ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమై 100 రోజులైందని,1350 కిలోమీటర్ల పూర్తి చేసుకుందని తెలిపారు.

ఉమ్మడి నల్గొండకు వైస్సార్ 33సార్లు వచ్చారని,నల్గొండ జిల్లా మీద వైస్సార్ కి అంత ప్రేమ ఉందని అన్నారు.నల్గొండ ఫోరైడ్ భూతాన్ని తరిమింది వైఎస్సార్ అని గుర్తు చేశారు.

అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి,500 కోట్లతో,200 కోట్లతో నిమ్స్ హాస్పిటల్ కట్టిన ఘనత వైఎస్సార్ దని,వైఎస్సార్ ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారని కొనియాడారు.పనిలో పనిగా స్థానిక ఎమ్మెల్యేను కూడా ఆమె అర్సుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యే లిక్కర్,మైనింగ్,అక్రమ దందాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నారని,అధికారులు తను చెప్పినవి చేయాలని హుకుం జారీ చేయడం మరిదారుణమని, ఎమ్మెల్యేకు కనీసం కృతజ్ఞత ఉందా,ఎమ్మెల్యేకు డబ్బు మదం పట్టింది,ఎమ్మెల్యే గాడుదులు కాస్తున్నాడా? అని ఘాటుగా విమర్శించారు.బాసర ఐఐఐటీలో స్థాపించింది రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఐఐఐటిలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు అంటే కనీసం ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదా? 12వ తరగతి చదవని మంత్రికి విద్యార్థుల సమస్యలు ఏమి తెలుస్తాయి,మంత్రి కూడా ఫామౌజ్ లోనే ఉంటుందని ఎద్దేవా చేశారు.3500 బడులను బంద్ పెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని,నిరుద్యోగులు ఇంతమంది చనిపోతున్నా కేసీఆర్ కు కనీసం కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అగ్నిపథ్ పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు.కేసీఆర్, కేటీఆర్ లు పక్క రాష్ట్రంపై దృష్టి పెడుతున్నారని, ఇక్కడ ఏమి చెయ్యలేని కేసీఆర్ కేంద్ర పార్టీ పెట్టడం విడురంగా ఉందని,బిఆర్ఎస్ అంటే బార్లు,రెస్టారెంట్ అని దుయ్యబట్టారు.

కేసీఆర్ కి అధికారం ఇవ్వడం దొంగల చేతికి తాళాలు ఇచ్చినట్లుగా ఉందనిన్నారు.పంట నష్ట పరిహారం ఇవ్వలేని పాలన కేసీఆర్ పాలన అని,తెలంగాణ ప్రభుత్వనికి ఖాళీ బీర్ బాటిల్స్ అమ్ముకొని బ్రతికే పరిస్థితి వచ్చిందని,రాష్ట్రంలో బడులు కంటే ఎక్కువగా బార్లు,బెల్ట్ షాప్ లు ఉన్నాయని అన్నారు.

రాష్ట్రంలో ఆడవాళ్లకు కూడా రక్షణ లేదని,ప్రభుత్వ వాహనాలు అత్యాచారం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు.హత్య రాజకీయలను పెంచిపోషిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని,8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు.

ఇంట్లో ఎంత మంది వృద్దులు,వికలాంగులు ఉన్నా అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తానని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube