ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురించి పరిచయం అక్కర్లేదు.ఇండియాలోని బిలియనీర్లలో టాప్-5లో ఉన్న ఆయన… సామాజిక, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు.
ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ వార్తల్లో ఉంటూ ఉంటారు.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్ర.
స్పూర్తిని కలిగించే వ్యక్తలకు సాయం చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్పూర్తిదాయక వ్యక్తుల ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉండే బిజినెస్ మెన్లలో ఆనంద్ మహీంద్ర తొలి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.
ఆనంద్ మహీంద్ర వ్యాపారవేత్తగా ఎంతగా పాపులర్ అయ్యారో.
సోషల్ మీడియాలో ఆయనే పెట్టే పోస్టులు కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.అదే బాటలో తాజాగా సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్ర ఒక అద్బుతమైన వీడియోను ట్విట్టర్ లో పంచుకున్నాడు.
వినూత్నమైన ఓ స్కూటర్ ని షేర్ చేశాడు.అన్ని వినోద అంశాలను జోడించి డిస్కో వెర్షన్ గా మార్చిన ఒక స్కూటర్ ను ట్వీట్ చేశాడు.
ఈ స్కూటర్ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర ఇలా రాసుకొచచారు.జీవితం మనం ఎంత కావాలనుకుంటే అన్ని రంగులుగా, అంత వినోదాత్మకంగా ఉంటుంది.
భారతదేశంలో మాత్రమే అంటూ ఆనంద్ మహీంద్ర తెలిపారు.

ఈ వీడియోకు 298కే వ్యూస్, 15కే లైక్ లో వచ్చాయి.ఈ స్కూటర్ ను పెట్రోల్ పంప్ వద్ద పార్క్ చేసి ఉంటుంది.ఈ స్కూటర్ ముందు భాగంలో ఉన్న టీవీలో రాజేష్ ఖన్నా పాడిన చుప్ గయే సా నజారే పాటు ప్లే అవుతుంది.
ఆ స్కూటర్ అందమైన రంగులతో, మెలిమెట్లు గెలిపే లైట్లతో, మెరిసే పులతో నిండి ఆకర్షణీయనీంగా ఉంది.ఈ స్కూటర్ చాలా బాగుందని, వినూత్న ఆలోచన అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.







