ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) చిత్రకూట్ జిల్లాలోని( Chitrakoot ) ఓ పాఠశాలలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.చిత్రకూట్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో( Government School ) ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం వీడియోలో కనిపించింది.
ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం వీడియోలో కనిపించింది.ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు.
దీనిపై ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది.నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మెగా టీచర్ పై రెచ్చిపోయింది.
మహిళా టీచర్ సప్నా శుక్లా,( Sapna Shukla ) మగ టీచర్ ఆదేశ్ తివారీ( Aadesh Tiwari ) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ ఘటన రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హారన్ పూర్వా ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులు( Teachers ) పాఠశాల వాతావరణాన్ని ఘర్షణ వాతావరణంగా నెలకొల్పి ఘర్షణ వాతావరణం సృష్టించారు.
అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు కొందరు నెటిజన్స్.
ప్రస్తుతానికి ఈ వీడియోలో గొడవకు గల కారణాలు వెల్లడి కాలేదు.ఈ విషయంలో పోలీసుల చర్య ఏదీ ఇంకా తెలియరాలేదు.అయినప్పటికీ, సోషల్ మీడియా అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో యూజర్లు తీవ్ర ప్రశ్నలు సంధిస్తున్నారు.
పూర్తి వివరాల కోసం మరింత సమయం వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే చాలామంది నెటిజన్స్ ఈ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.చదువు చెప్పాల్సిన వారే ఇలా ఉంటె.మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.