ఆ వర్కర్ ప్రోగ్రామ్‌లో సంస్కరణలు చేయాల్సిందే : కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి వ్యాఖ్యలు

కెనడా టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్‌పై( Temporary Foreign Worker Program ) కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ .( Immigration Minister Marc Miller ) ఈ ప్రోగ్రామ్ లోపభూయిష్టంగా లేదు కానీ, సంస్కరణ అవసరమన్నారు.

 Canadian Immigration Minister Marc Miller Says Temporary Worker Program Needs Re-TeluguStop.com

ఈ కార్యక్రమం తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయడానికి విదేశీయులకు అనుమతిస్తుందని, కార్మికుల కొరతను తీర్చడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశమని మిల్లర్ తెలిపారు.తక్కువ వేతనాలు, కార్మికులను దుర్వినియోగం చేస్తున్నందున ఈ ప్రోగ్రామ్ విమర్శలకు గురైంది.

Telugu Canada, Canada Foreign, Foreign Stream, Marc Miller-Telugu NRI

తక్కువ వేతనాలతో కూడిన ఈ ఫారిన్ వర్కర్ స్ట్రీమ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉందని మిల్లర్ పేర్కొన్నారు.ఈ ప్రోగ్రామ్ కింద కెనడాకు( Canada ) వస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లుగా మంత్రి చెబుతున్నారు.ఇది 2016లో 15,817 ఉండగా.2023లో 83,654కి పెరిగిందని మిల్లర్ తెలిపారు.ఆధునిక బానిసత్వంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి గతవారం ఓ నివేదికను సమర్పించారు.ఇందులో కెనడా తాత్కాలిక విదేశీ వర్కర్ ప్రోగ్రామ్‌ను ప్రస్తావించారు.ఇది సమకాలీన బానిసత్వానికి బ్రీడింగ్ గ్రౌండ్‌గా పనిచేస్తుందన్నారు.

Telugu Canada, Canada Foreign, Foreign Stream, Marc Miller-Telugu NRI

ఈ విధానంలో తక్కువ చెల్లింపులు, శ్రమ దోపిడీ వంటివి ఉన్నాయని.ఆరోగ్య సంరక్షణ కోసం కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని నివేదిక తెలిపింది.కెనడా ప్రభుత్వం తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోందని.

కానీ ఈ వలసదారులకు హాని కలిగించే సమస్యలను మాత్రం పరిష్కరించదని నివేదిక పేర్కొంది.కార్మికులకు శాశ్వత నివాసానికి తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా తాత్కాలిక విదేశీ కార్మికులకు( Foreign Workers ) నిర్మాణాత్మక అస్థిరత తగ్గించబడుతుందని సూచించింది.

అయితే మార్క్ మిల్లర్ ఈ బానిసత్వ లక్షణాలను ఇన్‌ఫ్లమేటరీగా అభివర్ణించారు.దేశంలో గృహ సంక్షోభం, ఆర్ధిక పరిస్ధితులు, దేశ ప్రజల్లో పెరుగుతోన్న వలస వ్యతిరేక సెంటిమెంట్‌ నేపథ్యంలో పరిస్ధితిని గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ వలసలు, విద్యార్ధి వీసాలపై జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube