వైరల్ వీడియో: ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..

ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) చిత్రకూట్ జిల్లాలోని( Chitrakoot ) ఓ పాఠశాలలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.

చిత్రకూట్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో( Government School ) ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం వీడియోలో కనిపించింది.

ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం వీడియోలో కనిపించింది.

ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు.దీనిపై ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది.

నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మెగా టీచర్ పై రెచ్చిపోయింది.

"""/" / మహిళా టీచర్ సప్నా శుక్లా,( Sapna Shukla ) మగ టీచర్ ఆదేశ్ తివారీ( Aadesh Tiwari ) మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడం సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఈ ఘటన రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్హారన్‌ పూర్వా ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులు( Teachers ) పాఠశాల వాతావరణాన్ని ఘర్షణ వాతావరణంగా నెలకొల్పి ఘర్షణ వాతావరణం సృష్టించారు.

అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు కొందరు నెటిజన్స్.

"""/" / ప్రస్తుతానికి ఈ వీడియోలో గొడవకు గల కారణాలు వెల్లడి కాలేదు.

ఈ విషయంలో పోలీసుల చర్య ఏదీ ఇంకా తెలియరాలేదు.అయినప్పటికీ, సోషల్ మీడియా అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో యూజర్లు తీవ్ర ప్రశ్నలు సంధిస్తున్నారు.

పూర్తి వివరాల కోసం మరింత సమయం వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే చాలామంది నెటిజన్స్ ఈ వీడియో పై విమర్శలు చేస్తున్నారు.

చదువు చెప్పాల్సిన వారే ఇలా ఉంటె.మరి విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ ఉద్యోగికి రూ.23 లక్షల ప్యాకేజీ వద్దట.. రూ.18 లక్షల ప్యాకేజే ముద్దట..?