కబ్జా చెరలో మోతె మండలంలో చెరువులు

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని చెరువులు కబ్జాల చెరలో చిక్కుకొని కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇటీవల స్థానికులు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.మండల పరిధిలోని రాంపురంతండా(గోపాలపురం) రెవెన్యూలో గల గండ్ల చెరువు సుమారు 450 ఎకరాల విస్తీర్ణంతో చుట్టూ పది గ్రామాలకు సాగునీరు అందించే కల్పతరువు అలాంది.

 Illegal Aquisition Of Ponds In Mote Mandal, Illegal Aquisition ,ponds ,mote Mand-TeluguStop.com

ఈ చెరువును ఆనుకొని పట్టా భూములు కలిగిన కొందరు రైతులు పోటీపడి చెరువు మట్టి తీసి,ఆ మట్టితోనే శిఖం భూములను అక్రమిస్తున్నారని సామాజిక సృహ కలిగిన కొందరు వ్యక్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.అయితే కబ్జాల విషయం అధికారులకు తెలిపిన వారిపై కబ్జాదారులు భౌతిక దాడులు చేసేందుకు కూడా వెనకాడడం లేదని,

అధికారులు ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే సర్వారం గ్రామాన్ని అనుకొని సుమారు 8 ఎకరాల విస్థిరణలో గల పెద్దచెరువు కూడా వందల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువులో ఎక్ సాల్ పట్టాలు కలిగిన కొందరు రైతులు ఈ ఏడాది చెరువు ఎండిపోవడంతో ఇదే అదునుగా చెరువు మట్టితోనే చెరువు శిఖం భూములను పూడ్చుకొని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని చెరువు శిఖం భూముల అడ్డగోలు కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి,ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని, చెరువులను సర్వే చేసి, హద్దు రాళ్ళను పాతి, విస్తీర్ణం వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేసి, చెరువులకు పూర్వ వైభవం వచ్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube