సూర్యాపేట జిల్లా నడిగూడెం( nadigudem ) మండలంలోనిరామాపురం,ఈకే పేట, తెల్లబల్లి గ్రామాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉదయం,సాయంత్రమనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని,ఒకవైపు వర్షంతో వీధులన్నీ బురదమయం,మరోవైపువిపరీతమైన దోమల బెడదతో రాత్రివేళలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తుందని వాపోయారు.
కరెంట్ ఎప్పుడు వస్తుందోనని విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని అన్నారు.విద్యుత్ అధికారులు సమస్యను గుర్తించి పరిష్కారించాలని, గ్రామాలలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని కోరుతున్నారు.