వైన్ షాప్ లో మంటలు 25 లక్షలు సరుకు దగ్దం...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రంలో ఊరికి దూరంగా పంట పొలాల్లో ఏర్పాటు చేసిన లక్ష్మీనరసింహ వైన్ షాప్ కు మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది.బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పంట పొలాలలోని వరి కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా మంటలు వ్యాపించాయి.

 A Fire In A Wine Shop Destroyed Goods Worth 25 Lakhs In Suryapet District, Fire-TeluguStop.com

ఇదే సమయంలో గాలి దుమ్ము రావడంతో ముందుగా పర్మిట్ రూము గుడిసెకు మంటలు అంటుకోగా వెంటనే స్పందించిన కౌంటర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

కానీ,గాలి దుమ్ము ఎక్కువ ఉండడంతో మంటలు అదుపులోకి రాక వైన్ షాప్ కు మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది.

ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ కొంతమేర మంటలు అదుపులోకి తెచ్చారు.వైన్ షాప్ లో మద్యం బాటిల్లు, సామాగ్రితో సహా సుమారుగా రూ.25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కౌంటర్ సిబ్బంది తెలిపారు.గరిడేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube