సూర్యాపేట జిల్లా: పాలకవీడు మండలం కృష్ణానదిపై గుండెబోయిన గూడెం వద్ద రూ.118.70 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఎత్తిపోతల పథకం పనులను శుక్రవారం హుజూర్ నగర్ ఆర్డీవో శ్రీనివాసులు సందర్శించారు.స్థానిక రైతులతో కలిసి నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించిన ఆయన గుండెబోయినగూడెం రెవెన్యూ శివారులోని
సర్వే నెంబర్ 65,66లో 05.20 ఎకరాలు భూ సేకరణకు సంబంధించిన వివరాలను తాహసిల్దార్ శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఎత్తిపోతల పథకం పనులపై సైట్ ఇంజనీర్ కిషోర్ తో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ కమలాకర్, రెవిన్యూ ఆర్ఐ,రైతు మలమంటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.