గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు

సూర్యాపేట జిల్లా:జిల్లాలోని కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో 10 కేసులు,కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు మొత్తం 11 కేసుల్లో సీజ్ చేసిన1 క్వింటా గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని బైపాస్ రోడ్ వెంటగల మైదానంలో శనివారం తగలబెట్టి నిర్వీర్యం చేశారు.ఈ సందర్భంగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఛైర్మెన్,జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గంజాయి వల్ల సమాజానికి,యువతకు భంగం వాటిల్లుతుందని,నష్టం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల మేరకు,జిల్లా జడ్జి ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సీజ్ చేసిన గంజాయిని తగలబెట్టినట్లు తెలిపారు.

 Police Burn Marijuana-TeluguStop.com

ఈకార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం,వెంకటేశ్వరరెడ్డి,సిఐలు నర్సింహారావు,పి.ఎన్.డి.ప్రసాద్,ఎస్ఐలు నాగభూషణరావు,మగ్దుం అలీ,రాంబాబు, సాయిప్రశాంత్,సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube