టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ ఇండస్ట్రీలో మరే హీరోకి లేదు అని చెప్పటంలో సందేహం లేదు.
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆయన అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
ఆయన నటించిన సినిమా ప్లాప్ అయినా కూడా ఆయన అభిమానులు మాత్రం సినిమా హిట్ అయినట్టు ప్రచారం చేస్తుంటారు.
ఇక పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలతో పాటు మరొకవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ చేసే అన్యాయాల మీద ప్రశ్నిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఒక వార్త పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊరటనిచ్చింది.
పెద్ద డిజాస్టర్ నుండి పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు అంటూ ఆయన అభిమానులు రిలాక్స్ అయ్యారు.సాధారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన రిజెక్ట్ చేసి హిట్ అయిన సినిమాల గురించి మాత్రమే కాకుండా ఫ్లాప్ అయిన సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో చర్చావేదికలు నిర్వహిస్తుంటారు.
ఇలా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వదులుకొని ఆ తర్వాత ఫ్లాప్ అయిన సినిమాల గురించి చర్చ జరిగింది.
గోపి గణేష్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్సే సినిమా నిన్న థియేటర్లలో విడుదలయ్యింది.నిన్న విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.బ్లాక్ బాస్టర్ లాంటి సక్సెస్ తర్వాత సత్యదేవ్-గోపి కలిసి చేసిన ఈ గాడ్సే సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
అయితే గోపి గణేష్ సినిమా కథని పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకొని రాసినట్టు సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల సత్యదేవ్ తో ఈ కథని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాను అంటూ గోపి గణేష్ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించి ఉంటే ఆయన జీవితంలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచిపోయేది అంటూ పవన్ అభిమానులు కొంచం ఊపిరి పీల్చుకుంటున్నారు.