ఎస్సీ వర్గీకరణ( SC classification ) కోసం పోరాటాల నిర్వహించాలని తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు( Sriramulu Thappetla ) మాదిగ తెలిపారు.శనివారం ఆయన నివాసంలో టి.
ఎమ్మార్పీఎస్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులుగా పిడమర్తి మధు మాదిగ,పెన్ పహాడ్ మండల అధ్యక్షునిగా ఒగ్గు రవి మాదిగ,మండల ప్రధాన కార్యదర్శిగా కొండేటి సందీప్ మాదిగను నియమించి వారికి నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో పార్లమెంటులో వర్గీకరణ బిల్లును ప్రవేశపెడతానన్న బీజేపీ ప్రభుత్వం( BJP ) మాట తప్పిందన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే వరకు బీజేపీ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకొనే సమయం ఆసన్నమైనదని కార్యకర్తలను సూచించారు.
పదవులు తీసుకున్నవారు జాతి అభివృద్ధి కోసం పాటుపడుతూ గ్రామ పట్టణ కమిటీలు నిర్మించుకొని వర్గీకరణ అంశం కోసం పోరాటాలు నిర్వహించాలని తెలిపారు.
తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రవణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు మన్సూర్ మాదిగ, టీఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మీసాల శివరామకృష్ణ( Sivaramakrishna ) మాదిగ, జిల్లా నాయకులు వల్దాసు రవి మాదిగ,చివ్వెంల మండల అధ్యక్షులు ఎడవెల్లి రాము,జిల్లా కార్యదర్శి వల్దాసు శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు పాతకోట్ల రమేష్, సూరారపు నాగయ్య, బొస్కు మంగయ్య, కుశనపల్లి సైదులు, నల్లగొండ అరుణ్, ములకలపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.