బంతి చెట్లలో గంజాయి మొక్క

సూర్యాపేట జిల్లా:తులసి వనంలో గంజాయి మొక్క అనేది పాత సమేత, కానీ,బంతి వనంలో గంజాయి మొక్క అనేది కొత్త ట్రెండ్ గా కనిపిస్తుంది.హూజూర్ నగర్ పట్టణం దీక్షిత్ నగర్ కు చెందిన బారి నాగరాజు తండ్రి అమరేశ్వర్ రావు(26) అనే యువకుడు గంజాయి మత్తుకు అలవాటుపడి ఏకంగా తన ఇంట్లోనే బంతి చెట్లలో ఒక గంజాయి మొక్క పెంచుతూ దొరికిపోయిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది.

 Marijuana Plant In Ball Trees-TeluguStop.com

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా బంతి చెట్ల మధ్య పెంచిన గంజాయి మొక్క లభ్యం కావడంతో నాగరాజును అదుపులోకి తీసుకుని,50 గ్రాముల గంజాయి మొక్క ను స్వాధీనం చేసుకున్నారు.గతంలో పలు దొంగతనాల కేసులలో నిందితుడు జైలుకు కూడా వెళ్లినట్లు హుజూర్ నగర్ ఎస్సై వెంకట్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube