యాదాద్రి భువనగిరి జిల్లా:ఈ నెల 29న భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయన్ని దర్శించుకొనున్నారు.రాష్ట్రపతి పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
పూర్వం ఈ క్షేత్రాన్ని నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు.రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరం చేసేలా సర్కార్ కసరత్తులు చేస్తుంది.
రాష్ట్రపతి రాకతో యాదాద్రి పుణ్యక్షేత్రం విశిష్టత,ఖ్యాతి దేశం నలుదిశల వ్యాపిస్తుందని దేవాలయ అభివృద్ధి అధికార సంస్థ వైస్ చైర్మన్ కిషన్ రావు పేర్కొన్నారు.ఈ క్షేత్రానికి వచ్చిన ఐదో రాష్ట్రపతిగా ముర్ము నిలవనున్నారు.