ప్రభుత్వ ఇఫ్తార్ విందులు ఒక్క తెలంగాణలోనే

సూర్యాపేట జిల్లా:నమ్మింది ఆచరించడం ఇతరులతో ఆచరింపచేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందని, సమాజంలో అన్నివర్గాల ప్రజలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతుందని నమ్మిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని,పేద ముస్లింలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డులో పవిత్ర రంజాన్ సందర్భంగా పేద ముస్లీంలకు దుస్తులు పంపిణీ చేసి,మదీనా మజీద్ లో ఇఫ్తార్ విందులో ఏర్పాటు చేసిన పాల్గొన్నారు.

 Government Iftar Dinners Are In Telangana Alone-TeluguStop.com

అనంతరం మంత్రి మాట్లాడుతూ గత పాలకులు ముస్లీంలను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూస్తే,ముస్లిం సమాజానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు.వారి ఉన్నతికి అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే చెల్లిందన్నారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుంటేనే అది మంచి సమాజం అవుతదని నమ్మిన నేత కేసీఆర్ అని అన్నారు.ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసింది కేవలం తెలంగాణలోనేనని దేశంలో ఎక్కడా లేదన్నారు.

పవిత్రమైన రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేయడం సంతోషించతగ్గ విషయమని, మైనార్టీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ,జడ్పి వైస్ చైర్మన్ గోపాగాని వెంకట్ నారాయణ గౌడ్,జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ పుట్ట కిషోర్,మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు సవరాల స్థానారాయణ,కార్యదర్శి బూర బాలసైదులు,ఉప్పల ఆనంద్,స్థానిక కౌన్సిలర్ జహీర్, ఎలిమినేటి అభినయ్,అబ్దుల్ రహీమ్ (పిల్లు ), రియాజ్,అహ్మద్,కరాటే సయ్యద్,అప్సెర్ భాయ్, ఫాయాజ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube