హుజూర్ నగర్ అభివృద్ధిపై టీఆర్ఎస్ చర్చకు సిద్ధమా?

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నల్లగొండ ఎంపీ,మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని హుజూర్ నగర్ కాంగ్రేస్ నేతలు సవాల్ విసిరారు.మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు కాంగ్రేస్ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డిపై పలు ఆరోపణలు చేసినందుకు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 Is Trs Ready To Discuss The Development Of Huzur Nagar?-TeluguStop.com

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇచ్చారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇచ్చారా?దళితబంధు ఇస్తామని ఇచ్చారా?ఇవ్వలేదు.రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు హుజూర్ నగర్ లో సక్రమంగా అమలు జరగుతున్నాయా?జరగడంలేదు.అవన్నీ ప్రజలు మర్చిపోవాలంటే ఉత్తమ్ మీద ఆరోపణలు చేయాలని మండిపడ్డారు.దళిత బంధు టిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని, సామాన్యుడికి అందటం లేదని ఆరోపించారు.ఎమ్మెల్యే సైదిరెడ్డి వచ్చిన తర్వాతనే హుజూర్ నగర్ లో లిక్కర్,ఇసుక,మట్టి,భూకబ్జాలు,పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువైనాయని ఆరోపించారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో ఎలాంటి కబ్జాలు జరగలేదని,ఉత్తంకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ లేఅవుట్ జోలికి కాంగ్రెస్ నాయకులు గాని,ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరు వెళ్లలేదని అన్నారు.

కానీ,ఇప్పుడున్న హుజూర్ నగర్ ఎమ్మెల్యే,చైర్మన్లు,కౌన్సిలర్లు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.టిఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందో బహిరంగ చర్చకు మేము సిద్ధమని,మీరు సిద్ధమైతే సవాల్ స్వీకరించాలని సవాల్ విసిరారు.

ఇంకొకసారి ఎంపీ ఉత్తమ్ మీద ఆరోపణలు చేసినట్లయితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube