మిర్యాలగూడలో కదం తొక్కిన గిరిజనులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది గిరిజనులు తరలివచ్చి బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కదంతొక్కారు.తెలంగాణ గిరిజన సంఘం మూడవ మహాసభల సందర్భంగా పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి సభా మైదానం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సాంప్రదాయ గిరిజన నృత్యాలతో,డప్పు వాయిద్యాలతో మహా ప్రదర్శన నిర్వహించారు.

 The Tribals Who Trampled On In Miryalaguda , Miryalaguda , Tribals, Manch Chairm-TeluguStop.com

ఈ ర్యాలీలో మాజీ ఎంపీ, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకరత్,మాజీ ఎంపీ ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ మీడియం బాబురావు, మాజీ ఎంపీ,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు అగ్రభాగాన నిలవగా,బహిరంగ సభా వేదికపై మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి,ఐద్యా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, గిరిజన సంఘం నాయకులు,కార్యకర్తలతో చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివాసి అధికార్ మంచ్ జాతీయ నేత, సీపీఎం మాజీ ఎంపీ బృందాకరత్ మాట్లడుతూ దేశంలో గిరిజన ద్రోహిగా మోడీ నిలిచారని, రాజ్యాంగం కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నాడని, అందులో భాగంగానే గిరిజన సంక్షేమానికి కేంద్ర బడ్జెట్లో కోత విధించాడని,దేశవ్యాప్తంగా గిరిజన మహిళలు పౌష్టికార లోపంతో అనారోగ్యం చెందుతుంటే మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,ఆదివాసి గిరిజనులకు చెందాల్సిన వాటా కేంద్ర బడ్జెట్లో జనాభా ప్రకారం పెట్టలేదని,గిరిజనులకు ద్రోహం చేసే విధంగా బడ్జెట్ ఉందని,ట్రైబల్ సబ్ ప్లాన్ తీసేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.దేశ జనాభాలో 8.6% ఉన్న గిరిజనులకు కేవలం 2.7% మాత్రమే నిధులు ఇచ్చారని ఇది గిరిజనుల పొట్ట కొట్టడమేనన్నారు.200 రోజులు పని కల్పించాల్సిన ఉపాధి హామీలు వందరోజులే పని కల్పించి,చేసిన ఆ పని కూడా వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు.దేశ వ్యాప్తంగా మోడీ చేస్తున్న బుల్డోజర్ రాజకీయాన్ని అడ్డుకుంటామని,మోడీ పతనానికి మిర్యాలగూడ నుంచే శ్రీకారం చుట్టామని,దానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

కార్మిక,కర్షకులు శ్రమించిన దేశ సంపద ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ వారికి దోచిపెడుతున్నాడని,నేడు దేశంలో ధనికుల పేదల మధ్య తీవ్ర వ్యత్యాసం పెరిగిందని వాపోయారు.

కష్టపడుతున్న కార్మిక, కర్షకులకు మోడీ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.ఎన్నికల ముందు ధరలు పెరిగాయని వాటిని తగ్గిస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చాక మోడీ ధరలను రెట్టింపు చేశాడని దాని ఫలితంగా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహమ్మారి కరోనా సమయంలో పేదలకు ఉచితంగా అందించాల్సిన ఆహార పదార్థాలను ఇవ్వకుండా రేషన్ షాపుల ఎత్తేసే ఆలోచనలో ఉన్నారని విమర్శించారు.డిజిటల్ ఇండియాలో గిరిజన ప్రాంతాల్లో నివసించే గిరిజన విద్యార్థులు కోవిడ్ సమయంలో ఇంటర్నెట్, ఆన్లైన్ సౌకర్యాలు లేక చదువుకు దూరమయ్యారని,ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గిరిజన యూనివర్సిటీలకు కేవలం కోటి రూపాయలు మాత్రమే బడ్జెట్లో నిధులు కేటాయించారని దీనిబట్టి చూస్తే గిరిజన పట్ల మోడీకి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.

అటవీ హక్కు చట్టానికి తూట్లు పొడిచి అడవులలో జీవించే గిరిజనులను తరిమికొట్టేందుకు చూస్తున్నారని విమర్శించారు.బిజెపికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి స్వాగతిస్తున్నామని,మోడీ చేసే విధానాలే కేసీఆర్ అమలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

పొడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ ఇటీవల హామీ ఇచ్చారని, ఆ హామీలు నిలబెట్టుకోవాలన్నారు.ఇచ్చిన హామీల అమలు చేయకపోతే గిరిజనుల పక్షాన సమరశిల పోరాటాలు చేస్తామన్నారు.

గిరిజన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి రాబోయే అసెంబ్లీ కురుక్షేత్రంలో గిరిజనులు అండగా నిలిచి తమ సత్తా చాటాలన్నారు.తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్,సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్,గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిరావత్ రవి నాయక్,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రవి నాయక్,కొర్ర శంకర్ నాయక్,గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube