బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా బాగా పాపులర్ అయిన అమ్మాయి హరితేజ.ఈ షో కంటే ముందే తను పలు సీరియల్స్, సినిమాల్లో నటించింది.అయినా.బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ క్రేజ్ సంపాదించింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటిస్తూనే.బుల్లితెరపై యాంకర్ గా అదరగొడుతుంది.
అటు నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా అఆలో హరితేజ మంచి క్యారెక్టర్ పోషించింది.ఇందులో సమంతకు పని మనిషిగా మంగమ్మ పాత్రలో నటించింది.
ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చింది.అటు కరోనా కారణంగా పలువురు సెలబ్రిటీలతో పాటు హరితేజ కూడా ఇంటికే పరిమితం అయ్యింది.
కరోనా గురించి.తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సోషల్ మీడియా ద్వారా జనాలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించింది.
అటు పలు విషయాల గురించి స్పందిస్తూ వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి విడుదల చేసింది.
తాజాగా తన అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ వేదికగా చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఓ అభిమాని మీ వయసు ఎంత అని ప్రశ్న వేశాడు.దానికి హరితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది.
నా వయసు గురించి మీరు చెప్పినా నమ్మరన్నది.నమ్మినా వినరు.
విన్నా అర్థం చేసుకోరు.నిజాలు ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటాయి.
అయినా చెప్తాను అంటూ తన డేట్ ఆఫ్ బర్త్ ను రివీల్ చేసింది.తాను ఫిబ్రవరి 24, 1992లో పుట్టినట్లు వెల్లడించిది.దానికి నెటిజన్లు స్పందిస్తూ.మీరు ఇంత చిన్న వారా? అంటూ క్వశ్చన్ చేశారు.
అటు మరో నెటిజన్ హరితేజను ఇంకో ఆసక్తికర ప్రశ్న వేశాడు.హిట్ సినిమాలో మీరు షీలా పాత్రలో నటించారు.సినిమాలో చూపించినట్లు మీరు నిజంగా సిగరెట్ కాల్చారా? అని అడిగాడు.అందుకు హరితేజ సమాధానం చెప్పింది.
ఆ సీన్ లో నిజంగానే సిగరెట్ కాల్చినట్లు చెప్పింది.ఆ పాత్రకు డిమాండ్ ఉన్నందున అలా చేయాల్సి వచ్చిందని చెపప్పింది.
బిగ్ బాస్ తర్వాత హరితేజ హవా కొనసాగిస్తుంది.వెండి తెరతో పాటు బుల్లితెర మీద సత్తా చాటుతుంది.