మోడీ నిరంకుశ విధానాలపై పోరాడుదాం:కొత్తపల్లి రేణుక

నూతన పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బ్రిషేశ్( BJP MP Brishesh ) క్కు ను కఠినంగా శిక్షించాలని నిరసన తెలియజేయాలని వస్తున్న మహిళా రేజ్లర్లపై విచక్షణారహితంగా దాడి చేసి ఈడ్చుకెళ్లిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పివోడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద పిఓడబ్ల్యూ, పి.

 Let's Fight Against Modi's Autocratic Policies: Kottapalli Renuka, Bjp Mp Brishe-TeluguStop.com

డీ.ఎస్.యు ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో అన్న మోడీ మాటలు నేడు నీటి మూటలుగా మారి భారత దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు,అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.అందులో భాగంగానే మహిళా రెజ్లర్ల గురించి బీజేపీ ఎంపీ బ్రిశేష్ అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంగా మారిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందే.

దానికి దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నా మోడీ స్పందించకుండా తన ఎంపీని శిక్షించకుండా మహిళా రెజ్లర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని,దానిలో భాగంగానే పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ రెజ్లర్లు నిరసన వ్యక్తం చేయడానికి వస్తుంటే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారిపై దాడులు చేస్తూ రోడ్డు మీద ఈడుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళలనే సానుభూతి లేకుండా విచక్షణా రహితంగా రోడ్డు మీద ఈడ్చికెళ్ళిన పోలీసులను శిక్షించి,ఎంపీతో క్షమాపణ చెప్పించి తనపై చర్యలు తీసుకొని మహిళల రేజ్లర్లకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,వారు తెచ్చే పతకాలకు సెల్యూట్ చేస్తూ అభినందించి,నేడు వారిని అవమానించడం దేశంలో ఉన్న ప్రతి స్త్రీని అవమానించినట్లని,దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సురం రేణుక,కోశాధికారి జయమ్మ,శైలజ,సౌందర్య పి.డి.ఎస్.యు నాయకులు సింహాద్రి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube