సూర్యాపేట జిల్లా:ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కారం అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి భూ సమస్యలపై దరఖాస్తులు అందుతున్నాయని,ఆయా సమస్యలపై అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించనైనదని అన్నారు.
ధరణి వెబ్ సైట్ నందు భూమి యొక్క స్థితిగతులను సంబంధిత దరఖాస్తు దారులకు వివరించడం జరుగుతుందని,తద్వారా సత్వరమే అర్జీదారుల సమస్యలకు పరిష్కారం అందుతుందన్నారు.జిల్లాలో వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున వడ దెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కలిపించాలని వైద్య, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని అన్నారు.ప్రజావాణిలో భూ సమస్యలపై 17,ఇతర శాఖలకు సంబంధించి 10 మొత్తం 27 దరఖాస్తులు అందాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి అనసూర్య,ఐసీడీయస్ జ్యోతి పద్మ,ఎఫ్.డి.ఓ సౌజన్య,పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి అర్జీదారులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.