నల్లగొండ జిల్లా: కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భజరంగ్ దళ్ పై నిషేధం విధిస్తామని పొందుపరిచిన విధానాన్ని నిరసిస్తూ నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయం ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పఠించి శాంతియుతంగా నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలిమధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్,రాష్ట్ర నాయకురాలు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్,బండారు ప్రసాద్,యాదగిరి చారి, సాంబయ్య,భూపాల్ రెడ్డి.
భవానీ ప్రసాద్,పాలకూరి రవి గౌడ్,కాశమ్మ,హైమ, తార,శంకర్ తదితరులు పాల్గొన్నారు.