ఈ మధ్య కాలంలో వరుసగా సినీ ప్రముఖులు మరణిస్తుండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.ప్రముఖ టాలీవుడ్ నటుడు మనోబాల అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మనోబాల( Manobala ) బుధవారం రోజున ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.నటుడిగానే ఆయన ప్రేక్షకులకు సుపరిచితమైనా నిర్మాతగా, దర్శకునిగా కూడా ఆయన రాణించారు.

అయితే ఒక వ్యసనం వల్లే ఆయన మృతి చెందారని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేదని మితిమీరి సిగరెట్లు తాగడం వల్లే ఆయన అనారోగ్య సమస్యల బారిన పడి మృతి చెందారని తెలుస్తోంది.మనోబాల మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే.మనోబాల మృతి కోలీవుడ్( Kollywood ) సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడం గమనార్హం.

గజిని( Ghajini ), ఊపిరి సినిమాల ద్వారా ఆయన తెలుగు రాష్ట్రాల( Telugu states ) ప్రేక్షకులకు దగ్గరయ్యారు.మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య, రాజ్ దూత్ మరికొన్ని సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఈ నటుడు మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.వాల్తేరు వీరయ్య మూవీలో లాయర్ రోల్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.మనోబాల ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు న్యాయం చేసేవారు.

మనోబాల కామెడీ టైమింగ్ ఇతర కమెడియన్లకు భిన్నంగా ఉండేది.1970 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి మనోబాల ఎంట్రీ ఇచ్చారు.డైరెక్టర్ గా కూడా మనోబాల 20 కంటే ఎక్కువ సినిమాలను తెరకెక్కించగా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.350 సినిమాలలో సహాయ నటుడిగా నటించి మనోబాల మెప్పించారు.మనోబాల మరణం సౌత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే చెప్పాలి.







