రాజద్రోహంపై ఇచ్చిన "స్టే" ని అమలు చేయాలి

సూర్యాపేట జిల్లా:సుప్రీంకోర్టు రాజ ద్రోహంపై ఇచ్చిన స్టే ను అమలు చేయాలని సీపీఐ(ఎం ఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మాండారి డేవిడ్ కుమార్ అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టం నేటికి కొనసాగించడం దూరదృష్టకరమని,చట్టాన్ని తెచ్చిన ఇంగ్లాండ్ దేశంలో రద్దు చేసినా,మన దేశంలో రద్దు చేయకపోవడం ఏమిటని? ఎవరి ప్రయోజనాలు కోసమని ప్రశ్నించారు.ప్రభుత్వాలపై నిరసన తెలియజేసినా,పాలకుల తీరును ప్రశ్నించినా ఈ దుర్మార్గమైన నల్ల చట్టాన్ని ప్రయోగించి,సంవత్సరాల తరబడి జైళ్లలో ఉంచడం పౌరుల హక్కులను హరిచించడమేనని తెలిపారు.తక్షణమే రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని,రాజద్రోహంతో పాటు ఉపా చట్టం కింద వందలాది మందిని అరెస్టు చేసి బెయిల్ నిరాకరించడమంటే ప్రశ్నించే గొంతులను నొక్కి వేయడం తప్ప ఇంకొకటి కాదని అన్నారు.

 The "stay" Given On Treason Must Be Enforced-TeluguStop.com

తక్షణమే రాజద్రోహం చట్టంతో పాటు ఉపా చట్టాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యూ.జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, పివైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు, ఐ.ఎఫ్.టి.యూ.జిల్లా ఉపాధ్యక్షుడు కారింగుల వెంకన్న,పి.డి.ఎస్.యూ.జిల్లా అధ్యక్షుడు పోలేబొయిన కిరణ్,పివైఎల్ జిల్లా నాయకులు వీరబోయిన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube