సూర్యాపేట జిల్లా:దీన్ దయాళ్ పథకం కింద ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్ల వరకు కరెంట్ ఉచితమని నమ్మించి,కూటికి గతిలేక కూలీనాలి చేసుకొని అత్యంత దారిద్య్రంలో మగ్గుతున్న వారికి విద్యుత్ మీటర్లు అంతగట్టి ఇప్పుడు 100 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వకుండా ఎస్సీ గూడేల్లో,ఎస్టీ తండాల్లో విద్యుత్,విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఎర్ర యాకోబు మండిపడ్డారు.మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామ ఎస్సీ కాలనీలో బలవంతంగా కరెంట్ బిల్లు వసూలు చేస్తుండగా గ్రామస్తులు అధికారులకు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ దయాళ్ పథకం పేరుతో ఎస్సీ,ఎస్టీలకు 100 యూనిట్లు ఉచితమని మాయమాటలు చెప్పి,వారికి మీటర్లు పెట్టి,ఇప్పుడు ఆ పథకం అమల్లో లేదని వారి నుండి బలవంతంగా కరెంట్బి ల్లులు వసూల్ చేయడం అంటే ప్రభుత్వాలు ఆ సామాజిక వర్గాలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే అదునుగా స్థానిక విద్యుత్ సిబ్బంది నెల వారి బిల్లులు కొట్టే క్రమంలో ఆలస్యం చేస్తూ,స్లాబ్ రేట్లు పెరిగేలా చూస్తూ,అధిక బిల్లులు వచ్చేలా చేస్తూ పేదలపై మరింత భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో నూటికి 90 శాతం ఉన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ మరియు అగ్రవర్ణ పేదలే అధికంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని,విద్యుత్ ను భారీగా దండుకునే పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను,ప్రజాప్రతినిధులను,అధికారులను వదిలేసి నిరుపేదలపై జులుం ప్రదర్శించడం అన్యాయమన్నారు.ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రెక్కల కష్టంపై ఆధారపడి జీవనం సాగించే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదల ఇళ్లల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్లను తక్షణమే తొలగించాలని,రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు.
అనంతరం స్థానిక లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ మరియు లైన్ మెన్ సాగర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బాలరాజు,పంది రమేష్,మామిడి శ్రావణ్,ఎర్ర రాంబాబు,మండల కార్యదర్శులు బోనపల్లి నరేష్,అందే రవి,బాబు, గణేష్,వెంకన్న,అంబేద్కర్,భాను,చింటూ,మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.