ప్రస్తుత చలికాలంలో అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.
దీంతో జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అయితే పెద్ద వారికి జలుబు వచ్చినా దానిని తట్టుకోగల సామర్థం ఉంటుంది.
కానీ చిన్న పిల్లలు జలుబు కారణంగా తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.అలాగే జలుబు చేసినప్పుడు శ్వాస సరిగ్గా అందక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటారు.
పైగా రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోలేకపోతుంటారు.కొన్ని కొన్ని సార్లు జలుబు కారణంగా జ్వరానికి సైతం గురవుతుంటారు.
మందులు వాడిన సరే ఒక్కోసారి జలుబు తగ్గదు.కానీ నెయ్యితో జలుబును తరిమికొట్టొచ్చు.అవును మీరు విన్నది నిజమే.అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.
ముందుగా ఒక చిన్న బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి.అలాగే రెండు లవంగాలు వేసి స్టవ్ పై ఒక నిమిషాల పాటు నెయ్యిని మరిగించాలి.
ఆ తర్వాత లవంగాలను తొలగించి నెయ్యిని గోరువెచ్చగా అయిన తర్వాత ఉదయం వన్ టేబుల్ స్పూన్, సాయంత్రం వన్ టేబుల్ స్పూన్ చొప్పున పిల్లలకు పట్టించాలి.ఇలా చేస్తే చిన్న పిల్లల్లో సహజంగానే జలుబు దెబ్బకు ఎగిరి పోతుంది.శ్వాస సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.పైగా నెయ్యిలో ఉండే పలు విలువైన పోషకాలు పిల్లల రోగ నిరోధక వ్యవస్థను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తాయి.
దాంతో సీజనల్ వ్యాధులు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.అలాగే నెయ్యి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి సహాయపడతాయి.మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అంతేకాదు నెయ్యి పిల్లల బోన్ మరియు మజిల్స్ డెవలప్మెంట్ ను పెంచుతాయి.పిల్లల్లో ప్రోటీన్ మరియు విటమిన్ డి, విటమిన్ ఏ కొరత ఏర్పడకుండా ఉండేందుకు సైతం హెల్ప్ చేస్తుంది.