సూర్యాపేట జిల్లా:ఆడపిల్లను పుట్టనిద్దాం పెరగనిద్దాం ఎదగనిద్దాంఅనే నినాదంతో బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఒకటవ వార్డు కుడకుడలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి మాట్లాడుతూ చిన్నపిల్లలు,మహిళలు, వృద్ధులని వయసుతో సంబంధం లేకుండా లైంగిక దాడులు,అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆడపిల్లల విషయంలో జోక్యం చేసుకోవాలంటే భయపడే విధంగా శిక్షలు ఉండాలన్నారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని కోరారు.
అప్పుడే దేశంలో నేరాలు,ఘోరాలు అదుపులోకి వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు పిండిగ నాగమణి,కోట సృజన, కొప్పుల రజిత,ఆవు దొడ్డి భాగ్యమ్మ,ఎల్గూరి లక్ష్మి, ఎల్లమ్మ,కవిత తదితరులు పాల్గొన్నారు.