సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల పేర్లు అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం నుండి (ఐ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్) ద్వారా బహిరంగంగా ప్రకటించాలని కోరుతూ (TSJA) తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ తరుపున సోమవారం సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ మోహన్ రావుకు వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు వార్తల సేకరణ కొరకు పలురకాల సమాచారం సేకరించేందుకు వెళ్లిన సందర్భంలో ప్రజాప్రతినిధుల నుండి,అధికారుల నుండి,జర్నలిజంపై అంతగా అవగాహనలేని తోటి జర్నలిస్టుల నుండి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా మరికొంతమంది జర్నలిస్టులు నిరాదరణకు గురవుతున్న కారణంగా తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.పనిచేస్తున్న జర్నలిస్టులను గుర్తిస్తూ వారు యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు కార్డుల ఆధారం చేసుకొని పూర్తి వివరాలతో జర్నలిస్టుల పేర్లు విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల డీపీఆర్వో కార్యాలయం నుండి పనిచేస్తున్న జర్నలిస్టుల పేర్ల ను బహిరంగంగా (అధికారికంగా) ప్రకటించాల్సిందిగా కోరారు.దీంతో తోటి జర్నలిస్టులతొ మాత్రమే కాకుండా వారు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా జర్నలిస్టులు డీపీఆర్వో కార్యాలయంలో మీ యాజమాన్యం ఇచ్చిన గుర్తింపు కార్డులను తీసుకొని కలెక్టర్ కార్యాలయంలో డీపీఆర్వో దగ్గర ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటు చేయించి అందులో తమ పేర్లను నమోదు చేసుకుంటే అధికారులు సమయం వచ్చినపుడు విడుదల చేస్తారని అన్నారు.అనుభవం కలిగి నిరాదరణకు గురవుతున్న చిన్న పెద్ద మీడియాలలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు అసోసియేషన్ లకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్టుల ఐక్యతను చాటుకొవాలని పిలుపు నిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులు సమయం చూసుకొని కలెక్టర్ కార్యాలయంలో పేరును నమోదు చేసు కోవాల్సిందిగా తెలిపారు.వినతిపత్రం ఇచ్చినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌసొద్దీన్,రాష్ట్ర సహాయ కార్యదర్శి దుర్గం బాలు, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు చిలుకల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.