ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది థైరాయిడ్, డయాబెటిస్, రక్తహీనత వంటి సమస్యలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.వీటి నుంచి బయటపడటం కోసం నానా పాట్లు పడుతుంటారు.
కానీ, ఇవి వచ్చాక బాధలు పడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టేస్టీ అండ్ హెల్తీ లడ్డు అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ ఆ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు జీడిపప్పు వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
ఆ తర్వాత బ్లండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు ఎండు ద్రాక్ష, వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.
వీటిని ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.ఈ లడ్డు సూపర్ టేస్టీగా ఉండటమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూలను తీసుకుంటే రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అలాగే ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.ఎముకలు కండరాలు దృఢంగా మారతాయి.
జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి మరింత మెరుగుపడతాయి.ఇక వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నించే వారు కూడా ఈ లడ్డూను తీసుకోవచ్చు.
ఈ లడ్డూను తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరమవుతుంది.మెటబాలిజం రేటు రెట్టింపు అవుతుంది.
దాంతో క్యాలరీలు త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.