నేను రాను తల్లో సర్కార్ దవాఖానకు...!

జనరల్ హాస్పిటల్ మాతా శిశు ఆరోగ్య కేంద్రం( Maternal and Child Health Care )లో జరుగుతున్న వరస శిశు మరణాలతో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే గర్భిణీలు జంకుతూ నేను రాను తల్లో సర్కార్ దవాఖానకు అంటూ హడలి పోతున్నారు.వరుస శిశు మరణాలకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని పేరెంట్స్ ఆరోపిస్తుండగా మరణాలపై కమిటీ వేసి విచారణ చేపడతామని హాస్పిటల్ సూపర్డెంట్ మురళీధర్ రెడ్డి( Superindent Muralidhar Reddy )అంటున్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పటల్లో మాతా శిశు విభాగంలో ఈ మధ్యకాలంలో శిశువుల వరస మరణాలతో బెంబేలెత్తిపోతున్నారు.వారానికి ఒక మరణం నమోదు అవుతుందని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Continuous Deaths In Maternal And Child Health Care,maternal And Child Health Ca-TeluguStop.com

శనివారం అర్వపల్లి మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన పుప్పాల రచన రెండవ కాన్పు కోసం సూర్యాపేట మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి శుక్రవారం ఉదయం వచ్చింది.వైద్యులు పరీక్షించి ఈనెల 19 వరకు డెలివరీ టైం ఉందని తెలపడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్లగా శనివారం ఉదయం నొప్పులతో బాధపడుతుండగా తిరిగి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు.

నార్మల్ డెలివరీకి టైం ఉందని నొప్పులు వస్తున్న సిజేరియన్ ఆపరేషన్ చేయకుండా వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చి సరైన వైద్యం అందించకపోవడంతో మగ శిశువు మృతి చెందాడని ఇది పూర్తిగా వైద్యులు నిర్లక్ష్యమేనని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొదటిసారి ఆడపిల్ల పుట్టగా, రెండవసారి మగ శిశువు జన్మించడంతో చాలా సంతోషపడ్డామని,కానీ, వైద్యుల నిర్లక్ష్య వైద్యం వల్ల శిశువు చనిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.

జిల్లా వైద్యాధికారులు తక్షణమే స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని,మగ బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన అనంతరం పలువురు పేరెంట్స్ మాట్లడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి డెలివరీకి రావాలంటేనే భయమేస్తుందని అన్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, ప్రైవేట్ హాస్పటల్ కు వెళ్లాలంటే డెలివరీకి వేలల్లో ఖర్చు వస్తుందని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రాణాలే పోతున్నాయని వాపోయారు.జరిగిన ఘటనపై ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపర్డెంట్ మురళీధర్ రెడ్డిని వివరణ కోరగా వరుస శిశు మరణాలు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని,శనివారం జరిగిన శిశు మరణంపై ఒక కమిటీ వేయడం జరిగిందని, నివేదికలో డాక్టర్ నిర్లక్ష్యమని తేలితే ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube