వేసవి తాపాన్ని తగ్గించే అద్భుతమైన సంజీవిని కీర దోస

వేసవికాలం ఎండలతో బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది.అయితే కొన్ని పనులకు తప్పనిసరిగా బయటకు వెళ్లక తప్పదు.

 Why-to-eat-cucumber-in-summer-season, Cucumber , Good Health , Health Tips , Hea-TeluguStop.com

ఇలా బయటకు వెళ్ళినప్పుడు వచ్చే వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.వేసవితాపానికి చెక్ పెట్టాలంటే కీరదోస ముక్కలను తినాలి.

కీరదోస వేసవి తాపాన్ని తగ్గించటమే కాకుండా శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు క్రమం తప్పకుండా కీరదోస ముక్కలను తింటూ ఉంటే శరీరంలో మలినాలు తొలగిపోయి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారికి కీర దోస మంచిది.

రాత్రి పడుకొనే ముందు కొన్ని కీరదోస ముక్కలను తింటే ఉదయం లేవగానే వచ్చే తలనొప్పి తగ్గిపోతుంది.అంతేకాక హ్యాంగోవర్ కూడా ఉండదు.

కీరదోస‌లో 95 శాతం నీరు ఉండుట వలన వేసవికాలంలో తరచుగా తింటూ ఉంటే శరీరం డీహైడ్రేడ్ అవ్వదు.అలాగే కీరదోసలో విటమిన్ సి ఉండుట వలన చర్మ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

కీరదోస ముక్కలను రౌండ్ గా కోసి కళ్ళ మీద పెట్టుకొని అరగంట రిలాక్స్ గాఉంటే కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలు తొలగిపోతాయి.ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేస్తే మార్పును చూసి మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

వేసవికాలంలో కాఫీ,టీ త్రాగటానికి బదులు కీరదోస ముక్కలను తింటే కీరదోసలో ఉండే విటమిన్ బి జీర్ణసమస్యలు రాకుండా కాపాడటమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube