సూర్యాపేట జిల్లా:జిల్లాలో మెడికల్ మాఫియాను అరికట్టి,ప్రవేట్ హాస్పిటల్లో దోపిడీని నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ )ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి,కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కి వినతిపత్రం అందజేశారు.అనంతరం సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ మాట్లడుతూ మెడికల్ మాఫియాను అరికట్టాలంటే ఆర్ఎంపి, పిర్వోల ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో కోదాడ, తిరుమలగిరి,సూర్యాపేట, హుజూర్ నగర్ పట్టణాలలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్,దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆరోపించారు.అర్హత ఉన్నా లేకున్నా హాస్పిటల్స్,ల్యాబ్స్, మెడికల్ షాపులను నడుపుతూ మెడికల్ దందా కొనసాగిస్తున్నారని అన్నారు.
ఆర్ఎంపీలను,పిర్వోలను ఏజెంట్లుగా పెట్టుకొని ఆర్ఎంపీలకు పేషెంట్ బిల్లులో 40% కేటాయిస్తూ పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేని పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు.జిల్లాలో జరుగుతున్న మెడికల్ మాఫియాపై కలెక్టర్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆర్ఎంపీలు, పిర్వోల ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేనియెడల తమ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ దందా అరికట్టే వరకు,ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడి నివారించేదాకా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మట్టిపల్లి అంజయ్య, ఐ ఎఫ్ టు యు జిల్లా కన్వీనర్ రామోజీ, పి.డి.ఎస్.యు జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పిఓడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, జయమ్మ,లక్ష్మి రాజేశ్వరి పద్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.