సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినదళిత బంధు పథకంలో జిల్లాలోని తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి తిరుమలగిరి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారని, మండలంలో దళిత బంధు దళితులకంటే దళారులకు ఎక్కువ ఉపయోగపడుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబు అన్నారు.మంగళవారం ఆయన తిరుమలగిరి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.
దళిత బంధు లబ్ధిదారులకు ఇష్టం లేకున్నా 90% మందికి, దళారులు అధికార పార్టీ నాయకులు కలిసి ఇష్టం లేని యూనిట్లను అంటగట్టారని,60 నుంచి 70 కోట్ల రూపాయల అవినీతి తిరుమలగిరి మండలంలో దళిత బంధు పథకంలో జరిగిందని, పేరుకు పది లక్షలు అంటూ ప్రకటించి 5 నుంచి 6 లక్షలు మాత్రమే లబ్ధిదారునికి అందుతున్నాయని,ఈ అవినీతిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు,ప్రభుత్వ అధికారులు కలిసి కుమ్మక్కై ప్రజల్ని నిలువునా ముంచుతున్నారనని తీవ్రమైన ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే తిరుమలగిరిలో నివాసం ఏర్పాటు చేసుకొని తిరుమలగిరిని అవినీతి అడ్డాగా మార్చాడని, తిరుమలగిరిలో జరిగే భూదందాలు,వడ్ల కొనుగోలు కుంభకోణం, దళిత బంధులో జరిగే ప్రతి అవినీతిలో ఎమ్మెల్యే కిషోర్ దే ప్రధాన పాత్రని అన్నారు.
ఇటీవలి మరణించిన తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన, కందుకూరి కొండయ్య కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే న్యాయం చేయాలన్నారు.