సూర్యాపేట జిల్లా: తెలంగాణకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానని కేంద్రం మాట తప్పితే రాజ్యసభలో యూనివర్సిటీ కోసం గొంతెత్తి సాధించానని, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఓటు అనే వజ్రాయుధం ఇచ్చాడని,యువతకు ఉద్యోగాలు కావాలంటే బీఎస్పీని గెలిపించాలని రాజ్యసభ సభ్యులు,బహుజన సమాజ్ పార్టీ కేంద్ర కోఆర్డినేటర్ రామ్ జి గౌతమ్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ పిల్లుట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్యహించిన కోదాడ నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని మాట్లాడుతూ…రాష్ట్రంలో లక్షకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని,కేసీఆర్ రైతులను,విద్యార్థులను, కూలీలకు మోసం చేస్తున్నారని,రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఎస్పీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి బహుజన ఉద్యమం బలోపేతం చేయాలని, అంబేద్కర్ వారసులుగా గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచాలని,బహుజన సమాజ్ పార్టీ అధికారం కొస్తే ప్రతి బహుజనుడు ఆ గ్రామ ముఖ్యమంత్రేనని,దేశ ప్రధానిగా మాయావతి కావడం ఖాయమన్నారు.కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండూ భాయి భాయి అని అన్నారు.
సంపన్నుల పార్టీలు అధికారంలోకి వస్తే సామాన్యుల బతుకులు దుర్భరంగా మారుతాయని,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మన రాజ్యాంగం మన రాజ్యాధికారం అనే నినాదంతో బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఉద్యమించాలన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసులను నీరుగార్చి అరాచకాలతో విధ్వంసాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాత్రిపూట నిద్ర పట్టడం లేదని,కళ్ళు మూస్తే ఆయనకు ఏనుగులు వస్తున్నాయన్నారు.అందుకే అంబేద్కర్ పేరును వాడుకుంటూ రాజకీయ లబ్ధి కోసం యత్నిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని విమర్శించారు.రైతులు,నిరుద్యోగులు, మహిళలు,విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
రాష్ట్రంలో లక్షన్నరకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వడంలో ఈ విఫలమైందన్నారు.
తాము ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు రెండు లక్షల 50 వేల ఇల్లు కట్టించామని,లక్షకు పైగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్యను అందిస్తామని,ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు.దేశ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అంబేద్కర్ వారసులుగా దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడు కోవాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.వచ్చే నెలలో జాతీయ సమీక్ష సమావేశాలు పార్టీ నిర్వహిస్తుందన్నారు.
ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఎంపీ రామ్జీని ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్,స్టేట్ కోఆర్డినేటర్ బాలస్వామి,స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దయానందరావు,బొడ్డు కిరణ్,జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.