సూర్యాపేట జిల్లా: శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని చాటి చెప్పే దినం మేడే అని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం,ఎస్సార్ గార్డెన్స్ లో భానుపురి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకలకు అయన ముఖ్యాతిథిగా హాజరై జెండా ఎగురవేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలో మనుషులు ఉన్నంత కాలం మేడే గుర్తు ఉంటుందన్నారు.కార్మిక లోకం సంఘటితంగా కలిసి తమ హక్కులను సాధించుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కార్మిక రంగ సంస్థలను బ్రతికించాడానికి కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే కార్మికులు జీవితాల్లో వెలుగులు వచ్చాయని కొనియాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశా, అంగన్ వాడీలతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం శ్రమకు తగిన విధంగా వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆరే దే అన్నారు.
మానవీయ కోణంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేత కేసీఆర్ అన్నారు.కార్మికుల శ్రేయస్సు కోసమే 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి బి.హెచ్.ఈ.ఎల్ ను నిలబెట్టిన ఖ్యాతి కేసీఆర్ ది అని అన్నారు.కార్మిక వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తున్న బీజేపీపై ఉద్యమించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
బీజేపీ నేతృత్వలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మికులకు హక్కులు లేకుండా చేస్తుందని విమర్శించారు.మోడీ సొంత రాష్టం గుజరాత్ లో సంఘాల నిషేధం నేటికీ అమలులో ఉండటమే దీనికి నిదర్శనమన్నారు.
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడమంటే అది కార్మికులకు ద్రోహం చేయడమే అని అన్న మంత్రి దానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి కార్మికులు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఎల్ఐసి,వైజాగ్ స్టీల్, విద్యుత్ ను ప్రైవేటు పరం చేయడానికి యత్నిస్తున్న బీజేపీని అడ్డకున్న కేసీఆర్ పై కక్ష్య సాధింపుకు పాల్పడుతుందని అన్నారు.
కార్మికుల వ్యతిరేఖి బీజేపీ అయితే కార్మికుల పక్షపాతి కేసీఆర్ అన్నారు.దేశంలో 35శాతం ప్రజలు ఒక్క పూట తిండితోనే కాలం వెళ్ళదీయడానికి కారణం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ పట్ల అనుసరిస్తున్న వ్యతిరేఖ విధానాలపై కార్మిక లోకం తిరుగు బాటు చేయాలన్నారు.భవన నిర్మాణ కార్మికులకు ఇస్తున్న మాదిరే ఇతర కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని ఇచ్చే విషయం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు.
త్వరలోనే సూర్యాపేటలో కార్మిక, కుల సంఘాల ఆత్మ గౌరవ భవనాలకు శంకుస్థాపన చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.కార్యక్రమంలో ఎంపి బడుగుల,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యదర్శి, కార్మిక సంఘం నేత వై.వీ, బీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు వెంపటి గురూజీ,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ,గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, విజయ్,పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు సవరాల సత్యనారయణ,ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్,జడ్పీటిసి జీడి భిక్షం,ఆకుల లవకుశ, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, తాహేర్ పాషా,సుదర్శన్, గుడిపూడి వెంకటేశ్వర్లు, సలీం,బాషామియా తదితరులు పాల్గొన్నారు.