తెలంగాణలో తొలి ఓటు నమోదు...!

నల్లగొండ జిల్లా: తెలంగాణ ఎన్నికల్లో మొట్టమొదటి ఓటు పోలయింది.ఈనెల 30వ తేదీన పోలింగ్ ఉంటే అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా? ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.80 ఏళ్లకు పైబడిన వృద్ధులు,దివ్యాంగులు, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది.దీనిద్వారా పోలింగ్ తేదీ కంటే ముందే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

 First Vote Registration In Telangana, First Vote , Telangana, Chunduri Annapoorn-TeluguStop.com

ఈ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల అధికారులు, పోలీసుల సహాయంతో ఓటరు ఇంటికే పోస్టల్ బ్యాలెట్ తీసుకువెళ్లి ఇస్తారు.ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే సౌకర్యాన్ని అదే ఇంట్లో కల్పిస్తారు.

ఓటు వేశాక దాన్ని కవర్లో పెట్టి, ఎన్నికల అధికారికి ఓటరు అప్పగిస్తారు.ఈ ప్రక్రియను వీడియో తీస్తారు.

ప్రస్తుత ఎన్నికల్లో మంగళవారం ప్రారంభమైన ఈ సదుపాయం ఈనెల 27వరకు కొనసాగుతుంది.అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజులలోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ ఈ సదుపాయాన్ని వినియోగించుకుని మంగళవారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇలా పోలైన పోస్టల్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిశాక,అన్ని ఓట్లతో కలిపి లెక్కిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube