జూనియర్ పంచాయతీ కార్యదర్శులపై ప్రభుత్వం బెదిరింపులు సరికాదు:సీపీఎం

సూర్యాపేట జిల్లా: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటుగా అనేక సమస్యలపై శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ఈనెల 9వ తేదీ సాయంత్రంలోపు విధుల్లో చేరాలని, లేని యెడల విధుల నుండి తొలగిస్తామని ప్రభుత్వం బెదిరింపు చర్యలకు పాల్పడడం అన్యాయమని ఇది అప్రజాస్వామిక నియంతృత్వ చర్యని సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు.మంగళవారం ఆయన ప్రభుత్వ అల్టిమేటంపై స్పందిస్తూ గత 11 రోజులుగా శాంతియుతంగా నిరవధిక దీక్ష చేస్తున్న వారి సమస్యల్ని విని పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిపై బెదిరింపులకు దిగడం సరికాదన్నారు.

 Govt Threats Against Junior Panchayat Secretaries Are Wrong Cpm,junior Panchayat-TeluguStop.com

గత నాలుగు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్నారని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వారు రెగ్యులర్ చేయాలని కోరుతున్నారని అన్నారు.అదేవిధంగా విధుల్లో ఉంటూ మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారని,ఇవేమి గొంతమ్మ కోర్కెలు కావని తెలిపారు.

బెదిరింపులు మానుకొని వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube