సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం అనాజిపురం ఆదర్శ పాఠశాలలో వంటగది లేక ఆరు బయట వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని,దీనితో మధ్యాహ్న భోజన కార్మికులు( Mid day meal workers ) నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారని,వెంటనే అధికారులు వంట గది నిర్మించి సమస్యను పరిష్కరించాలని సిఐటియు సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ అన్నారు.ఆదర్శ పాఠశాలలో సుమారు 300 మంది పిల్లలు చదువుతున్నారని,వారికి మధ్యాహ్నం భోజనం చేసే వంటగది నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎండకు, గాలికి వండటంతో వంటలు సరుగా కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ప్రభుత్వం వంటగ్యాస్( Cooking Gas ) ఇవ్వాలని,అదేవిధంగా నెలలు తరబడి వారు బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,తక్షణమే నెలనెలా వంట బిల్లులు ఇవ్వాలని,గుడ్డుకు ఎనిమిది రూపాయలు చొప్పున ఇవ్వాలని,గత ప్రభుత్వం హామీ ఇచ్చిన మూడు వేల రూపాయలు వేతనం,గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామాలలో రాజకీయ వేధింపులు తగ్గించాలన్నారు.
రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన నాయకురాళ్లు సరస్వతి, రేణుక,ఎల్లమ్మ,మానస,శ్రావణి తదితరులు పాల్గొన్నారు.