నల్లగొండ జిల్లా:సోమవారం దేశ వ్యాప్తంగా ఆనందోత్సవాలతో జరుపుకున్న రంగుల కేళీ రంగో(హో)లి పండుగపై ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి ప్రభావం పడింది.కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా యువత పెద్దగా రంగుల పడుంగపై ఆసక్తి చూపలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో చెరువులు,కుంటలు ఎండిపోవడం,ముఖ్యంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేకపోవడంతో రంగులు పూసుకుంటే అంత ఈజీగా వదలవు కాబట్టి ఎక్కువగా చెరువులు, బావులు,కాలువలపై ఆధారపడేవారు దూరంగా ఉన్నారు.కనీసం కొన్ని గ్రామాల్లో తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే హోలీ చేసుకొని నీటి కష్టాలు కొనితెచ్చుకోడం దేనికని అన్నట్లు తెలుస్తోంది.