ప్రభుత్వం ఇచ్చింది అనారోగ్య కార్డులా?ఆరోగ్య కార్డులా?

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనుదారుల,జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజె హెచ్ఎస్)మొక్కుబడిగా కొనసాగుతోందని ప్రముఖ ప్రజా ఉద్యమకారుడు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాషన్న ఆరోపించారు.అత్యధిక కార్పొరేట్ ఆస్పత్రులు (ఈజె హెచ్ఎస్) కార్డులను తిరస్కరిస్తున్నాయని మహిళా జర్నలిస్ట్ అగ్రకుల పేదల హక్కుల సాధన కోసం గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్న కుంభం మంజులా రెడ్డి సెల్ నెంబర్:9492963359 చెప్పిన బాధాకర విషయాలను బహుజన విప్లవ నేత కామ్రేడ్ బోరన్న ప్రభుత్వానికి గుర్తు చేశారు.అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు,పింఛనుదారులు, పాత్రికేయులు తమ చేతిలో ఉన్న (ఈజెఎచ్ఎస్) కార్డులను తీసుకెళ్లి ప్రైవేటు హాస్పిటల్స్ లో చేరుదామంటే ససేమిరా అంటూ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయని సిపిఐ(ఎమ్ఎల్)రాష్ట్ర కార్యదర్శి బోరా సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు రాసిన బహిరంగ లేఖలో కార్పొరేట్ హాస్పిటల్స్ పై ఫిర్యాదు చేశారు.రోగులను ముందు డబ్బులు కట్టి తర్వాత రియంబర్స్మెంట్ చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నాయని ఆరోపించారు.

 Is It The Health Card Issued By The Government? Health Card?-TeluguStop.com

ప్రభుత్వం తమకు సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని బకాయిలు పేరుకుపోయాయనే సాకుతో ఆసుపత్రుల్లో చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయని ప్రజా నేస్తం బోరన్న తెలిపారు.కొన్ని హాస్పిటల్స్ లో ఒకవేళ చేర్చుకున్న తమ హాస్పిటల్ కు ఏ చికిత్స ద్వారా ఆర్థికంగా ఎక్కువ లాభం చేకూరుతుందో అటువంటి వాటికి అనుమతి ఇస్తున్నారని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు,సీనియర్ జర్నలిస్టు బొల్లం శ్రీనివాస్ యాదవ్ సెల్ నెంబర్: 9010223697 చెప్పిన ఆవేదనను అర్థం చేసుకోవాలని అభ్యుదయ ప్రజా ఉద్యమాల నాయకుడు కామ్రేడ్ బోసన్న కోరారు.ఇటువంటి సందర్భంలో తన మేనమామ,రైతు-కూలి శ్రమజీవి ఏపూర్-సూర్యాపేటకు చెందిన అమర జీవులు మున్న లింగయ్య-గంగమ్మ యాదవ్ ల చిన్న కొడుకు మున్నా గురువయ్య యాదవ్ సెల్ నెంబర్:9948562850 చెప్పిన మాటల ప్రకారం అక్కరకురాని చుట్టం ఉంటే ఎందుకు? ఉండకపోతే ఎందుకు? రోగుల అవసరానికి ఉపయోగపడని ఆరోగ్యకార్డులు ఎందుకని ప్రజా బంధువు అవార్డు గ్రహీత బోర సుభాషన్న బాధను వ్యక్తం చేశారు.దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందిన ప్రతి సందర్భంలోనూ ఉన్నతాధికారులు తాత్కాలికంగా చొరవ చూపడం,ఆ తర్వాత ఫిర్యాదులను చెత్త కాగితాల్లో వేసినట్లు వ్యవహరించడం షరా మామూలుగా మారిందని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోరన్న తెలిపారు.

వాస్తవానికి 2014లో తెలంగాణ సర్కార్ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రారంభించి 2017 లో (ఈజె హెచ్ఎస్) పథకం కింద చికిత్సలకు కొత్త ధరలను ఖరారు చేసిన నేపథ్యంలో ఆ తరువాత ఏడాదిపాటు ప్రైవేటు,కార్పొరేటు ఆసుపత్రులలో తొలుత బాగానే నాలుగు వేలకు పైగా చికిత్సలు చేశారని బోరన్న పేర్కొన్నారు.ఆ తరువాత కాలంలో దాదాపు ఆరీంతల కేసులు 35 వేలకు పైగా పెరిగాయని ఇటువంటి ఈ నేపథ్యంలో నిధులు విడుదలలో జాప్యం కారణంగా ప్రైవేటు ఆసుపత్రులు క్రమేణా చికిత్సకు నిరాకరిస్తున్నాయని బోర సుభాషన్న పేర్కొన్నారు.

మొత్తం చికిత్సలను నిరాకరిస్తే ప్రభుత్వానికి బాగోతం తెలిసిపోతుందని కొన్ని హాస్పిటల్ తమకో లాభసాటిగా ఉన్నవాటికి అనుమతిస్తూ సరికొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారని బోరన్న పేర్కొన్నారు.ఔషధ చికిత్సలు,జనరల్ సర్జరీ,సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ తదితర విభాగాలకు సంబంధించిన కేసులు తక్కువగా గుండె రక్తనాళాల్లో స్టంట్లు,మూత్రపిండాల్లో రాళ్లు, క్యాన్సర్ కు రేడియేషన్ తదితర చికిత్సలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో,లేదో తేల్చి చెప్పాలని పీడిత ప్రజల హక్కులకోసం గత 30 సంవత్సరాలు ప్రజా పోరాటాలు చేస్తున్న విప్లవ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ సుభాషన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ హాస్పిటల్స్ లో బ్రతికి ఉన్నవారికి కూడా వైద్యం చేయరని,కార్పొరేట్ హాస్పిటల్స్ లో చనిపోయిన శవాలకు కూడా మెరుగైన వైద్యం అందిస్తారనే ప్రచారంలో ఉన్నాయి.ఇలాంటి ఎత్తుగడలు తెలియని రోగులు ప్రైవేటు,కార్పొరేట్ హాస్పిటల్ కి ఆరోగ్య కార్డులతో వెళ్లి తీవ్ర నిరాశకు లోనవుతున్నారని ప్రజా నేస్తం బోర సుభాషన్న పేర్కొన్నారు.

ఇవి ఆరోగ్య కార్డులా? దండగమారి అనారోగ్య కార్డులా? అని ఆరోగ్య మంత్రిని బాధితుల పక్షాన బహుజన బంధువు బోర సుభాషన్న ప్రశ్నించారు.తక్షణమే ఆరోగ్య కార్డుల సమస్యలను పరిష్కరించాలని బోర సుభాషన్న డిమాండ్ చేశారు.

సమస్యల్లో ఉన్న ప్రజల కోసం 9848 540078 నెంబర్ని పీపుల్స్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ గా పెట్టామని సలహా,సమాచారం కోసం 9848540078 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమస్యలను పంపాలని ప్రజా శ్రేయోభిలాషి బోర సుభాష్ చంద్రబోస్ సమస్యలతో బాధపడుతున్న ప్రజలను కోరారు.సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని,సమస్యల పరిష్కారం కోసం చట్టబద్దంగా ప్రజాస్వామిక పోరాటాలు ఉద్యమాలు కొనసాగిస్తామని బోరన్న పేర్కొన్నారు.24 గంటలు ఈ పీపుల్స్ హెల్ప్ లైన్ నెంబర్:9848540078 అందుబాటులో ఉంటుందని,తమ దృష్టికి వచ్చిన సమస్యలపై ముఖ్యమంత్రి నుండి ఇతర ప్రజాప్రతినిధులకు,అధికారులకు ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలు తెలియజేస్తూ లేఖలు రాస్తామని సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాషన్న తెలిపారు.రాష్ట్రంలో అన్ని వర్గాల,కులాల ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు,సమస్యల పరిష్కారం కోసం బాధిత ప్రజలు సంఘటితమై ప్రజా పోరాటాలు కొనసాగించాలని ప్రజా అభ్యుదయవాది కామ్రేడ్ బోర సుభాషన్న ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube