సూర్యాపేట జిల్లా: ఈ నెల 25 నుండి 28 వరకు జరిగే పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్స్ నిర్వహణ నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాన్ పహాడ్ ఉర్సు నిర్వహణపై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనవు కలెక్టర్ సిహెచ్.ప్రియాంకతో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉర్స్ కు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆదిశగా పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఉర్సు నిర్వహణ నేపథ్యంలో హుజూర్ నగర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు.
దర్గా ఆవరణ మొత్తం మొరం మట్టితో చదును చేయాలని,భక్తులు పూజా కార్యక్రమంలో ఇబ్బందులు కలగకుండా భారీకేడ్లు ఏర్పాటు చేసి,పోలీసుల నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సూచించారు.దర్గా ప్రాంతంలో,పార్కింగ్ ప్లేస్ లలో నిరంతర విద్యుత్ తో పాటు త్రాగునీరు,మెడికల్ క్యాంపులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని,అలాగే వాహనాల పార్కింగ్ ప్రాంతాలు దగ్గరగా ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.విద్యుత్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్,
మెడికల్,రెవెన్యూ శాఖల అధికారులు,సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది నిర్దేశించిన విధంగా విధులు నిర్వహించాలని, ఉర్స్ నిర్వహణ సందర్బంగా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఉర్స్ నిర్వహణ నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం నిర్దేశించిన సమయంలో ఆర్టీసి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో ఎసిపి నాగేశ్వరరావు,జెడ్పి సిఈఓ సురేష్ కుమార్, డిపిఓ యాదయ్య,డిఎస్పి నాగభూషణం,వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఎస్కె.
మహమూద్, సర్పంచ్ కృష్ణ,శ్రీనివాస్, జానీ తదితరులు పాల్గొన్నారు.