బస్తీ దవాఖానను తనిఖీ చేసిన కలెక్టర్...!

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ ఆరోగ్య కార్యక్రమం జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు వైద్య అధికారులను ఆదేశించారు.

 The Collector Who Inspected Basti Davakhana...!-TeluguStop.com

మంగళవారం ఆయన సూర్యాపేట పట్టణంలోని కుడకుడలో గల బస్తీ దవాఖానను సందర్శించి మహిళలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు.ప్రతి మంగళవారం జిల్లాలో నిర్దేశించిన బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు సేవలు పొంది,సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

కుడకుడ బస్తీ దవాఖానలో హాజరైన ప్రతి మహిళ యొక్క ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వీరికి సేవలు అందించాలని సంబంధిత వైద్యాధికారి,ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.వైద్యాధికారి,ఆరోగ్యసిబ్బంది ఆసుపత్రులకు వచ్చే వారికి అవసరమైన మందులతో పాటు చికిత్స అందించాలని కలేక్టర్ సూచించారు.

మహిళలందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి క్యాన్సర్,బిపి,షుగర్, గర్భాశయ వ్యాధులకు నిర్ణిత సమయంలో గుర్తించి చికిత్స పొందాలన్నారు.అన్ని వ్యాధులకు ప్రభుత్వ బస్తీ దవాఖాన,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉచితంగా మందులు అందించి చికిత్స చేస్తారన్నారు.

అందరూ మహిళలు ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube