ప్రస్తుత చలి కాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలే అందరినీ ప్రధానంగా వేధిస్తుంటాయి.సీజనల్ సమస్యలే అయినప్పటికీ.
ఇవి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి.పైగా ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలు కూడా ఇవే కావడంతో ప్రజలు తెగ వణికిపోతున్నారు.
అందుకే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు పట్టుకున్నాయంటే.వెంటనే వాటిని తగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను తరిమి కొట్టడంలో పాలకూర అద్భుతంగా సహాయపడుతుంది.ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే పాలకూరలో పోషకాలు మెండుగా ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా పాలకూర అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా పాలకూరను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే కేవలం మూడు రోజుల్లోనే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు పరార్ అవుతాయి.
ముందుగా పాలకూర తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి లైట్‌గా క్రష్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే.అందులో క్రష్ చేసి పెట్టుకుని పాల కూర వేసి పది నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలిపి సేవించాలి.
ఇలా ఉదయాన్నే మూడు రోజుల పాటు తీసుకుంటే.అందులో ఉండే శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ సిస్టమ్‌ను చురుగ్గా మార్చి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను నివారిస్తాయి.అలాగే శ్వాస కోశంలో ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగించి.
ఫ్రీగా శ్వాస ఆడేలా చేస్తాయి.మరియు పాలకూరతో తయారు చేసిన ఈ పానియాన్ని తాగడం వల్ల ఆస్తమా లక్షణాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.