మిల్క్ షేక్ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!

ఎండాకాలంలో విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇలాంటి వాతావరణంలో సాధారణంగా శీతల పానీయాలకు( soft drinks ) డిమాండ్ బాగా పెరిగిపోతుంది.

 Are You Drinking Milk Shake But Be Careful , Drinking Milk Shake, Health , Healt-TeluguStop.com

వాటిలోనూ పండ్ల రసాలకు, షేక్స్, స్మూతీస్ ని జనాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.ఈ ఎండాకాలంలో శరీరానికి శక్తిని ఇచ్చేందుకు అందరూ వాటి వైపే మగ్గుచూపుతూ ఉన్నారు.

ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.అయితే వీటిని తరచూ తీసుకోవడం వలన యాక్టివ్గా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఎండాకాలం అంటే మనకు గుర్తొచ్చే పండు మామిడి పండు.

Telugu Banana Shake, Tips, Mango, Soft Drinks-Telugu Health

వీటితో కూడా మిల్క్ షేక్లు తయారు చేస్తున్నారు.అలాగే అరటిపండు షేక్ ( Banana shake )కూడా విరివిగా మార్కెట్లో లభిస్తూ ఉంటుంది.మరి ఈ రెండిట్లో ఏది మంచిది? అసలు అన్నీ పండ్లతో కలిపి షేక్స్ చేయవచ్చా? అనే విషయానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.అన్ని పండ్లతో పాలను మిక్స్ చేస్తే ఆరోగ్యం ఏమో కానీ చాలా రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి.ఆయుర్వేదం ప్రకారం అన్ని పండ్లు పాలతో కలపడం మంచిది కాదు.

తీపి, పూర్తిగా పండిన పండ్లు మాత్రమే పాలతో కలిపి షేక్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.మామిడి, అరటి( Mango ) రెండు తీయగా ఉంటాయి.

Telugu Banana Shake, Tips, Mango, Soft Drinks-Telugu Health

కాబట్టి వీటిని ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ లో మామిడి, అరటి మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు.అయితే ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా కాదా ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పండ్ల ప్రకారం చూసుకుంటే ఈ రెండు ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి.కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు( Ayurvedic doctors ) అంటున్నారు.

అరటిపండు తీపిగా ఉండవచ్చు.కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారిపోతుంది.

ఇది పాలతో మిక్స్ చేయడానికి పనికిరాదు.అందుకే రెండిటిని కలపకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

దీన్ని పరిమితంగా తీసుకుంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube