యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘ఆదిపురుష్‘( Adipurush ).ఈ సినిమా జూన్ 16న శుక్రవారం గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.కొన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకుంది.
ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే మిశ్రమ స్పందన రాగా టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ తో అదరగొట్టింది.ఓపెనింగ్స్ మాత్రమే కాదు.
మూడు రోజుల పాటు డార్లింగ్ బాక్సాఫీస్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.రిలీజ్ రోజు ఆ తర్వాత వీకెండ్ రెండు రోజులు కలిసి ఈ సినిమాకు మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ వచ్చాయి.
మొదటి రోజు ఈ సినిమా 140 కోట్ల గ్రాస్ వసూళ్లు( Adipurush Collections ) రాబట్టింది.ఇక మూడు రోజుల్లోనే 300 కోట్ల మార్క్ చేరుకొని అదరగొట్టింది అనే చెప్పాలి.అయితే సోమవారం కాస్త డల్ అయిన ఆదిపురుష్ 35 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది.ఇక నాలుగు రోజుల్లో ఆదిపురుష్ 375 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
మరి ఈ రోజు కలెక్షన్స్ కలిపితే 400 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది.240 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు 164 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగా ఇంకా దాదాపు 78 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.మొత్తానికి డార్లింగ్ ఈ సినిమాతో అయిన బ్రేక్ ఈవెన్ సాధిస్తాడా లేదంటే మళ్ళీ నిర్మాతలకు నష్టాలను ఇస్తాడో వేచి చూడాలి.