గ్రూప్-4 పరీక్షలు పకడ్బందిగా నిర్వహించాలి:ఇంచార్జ్ డిఆర్ఓ రాజేంద్ర కుమార్

జిల్లాలో టీఎస్ పీఎస్సీ జూలై 1న నిర్వహించే గ్రూప్-4 పరీక్షలు( Group4 Exams ) పకడ్బందిగా నిర్వహించాలని ఇంచార్జ్ డిఆర్ఓ రాజేంద్రకుమార్( DRO Rajendra Kumar ) అన్నారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చీఫ్ సూప రింటెండెంట్లు,రూట్ ఆఫీసర్లు,లైజనింగ్,పోలీస్ అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తో కలసి పాల్గొన్నారు.

 Group 4 Exam Should Be Conducted In Armour Says Incharge Dro Rajendra Kumar ,gro-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పరీక్షల నిర్వహణకు 97 కేంద్రాలు ఏర్పాటు చేయగా వాటిని 22 రూట్లుగా విభజించామన్నారు.పరీక్షల నిర్వహణకు నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లను నిబద్ధతతో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పనిచేయాలని సూచించారు.జిల్లాలో 30315 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయం త్రం 5గంటల వరకు ఉంటుందన్నారు.సూర్యాపేట 42 కేంద్రాలు, చివ్వెంల 1 కేంద్రాలలో 12823 మంది, ఆత్మకూర్ (ఎస్)1,నూతనకల్ 2 కేంద్రాలలో 792 మంది, పెన్ పహాడ్ 1,గరిడేపల్లి 1 కేంద్రాలలో 576,నేరేడుచర్ల లో 5 కేంద్రాలలో 1296 మంది,చిలుకూరు 3, హుజూర్ నగర్ 7 కేంద్రాలలో 3504, మునగాల1,నడిగూడెం 1, కోదాడ 23,అనంతగిరి1, చిలుకూరు 1 కేంద్రాలలో 9072 మంది, తిరుమలగిరి 2 కేంద్రాలలో 624 మంది అలాగే తుంగతుర్తి 5 కేంద్రాలలో 1608 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.

ఇన్విజిలేటర్లకు ముందుగా అవగాహన సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలను వివరించాలని సూచించారు.పరీక్షా కేంద్రంలోనికి సెల్ఫోన్లు,వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు.అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించి రావాలని,ఇన్విజిలేటర్లు సెల్ ఫోన్లను కూడా అనుమతించవద్దన్నారు.పరీక్షా కేంద్రంలోని హాల్ టికెట్,ఐడీ కార్డ్ లేకుండా ఎవ్వరినీ అనుమతించ వద్దన్నారు.

ముందుగా తహసీల్దార్లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి వసతులను పరిశీలించాలన్నారు.అన్ని కేంద్రాలలో కూడా 1202 సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దివ్యాంగ అభ్యర్థుల కోసం భవనంలో కింద ఫ్లోర్ లో ఉన్న గదులను కేటాయించాలని సూచించారు.అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు తప్పక ఏర్పాటు చేయాలన్నారు.

ఈ సమావేశంలో డిఈఓ అశోక్, టిఎస్పిఎస్సి అధికారి చైతన్య గౌడ్, ఆర్డీఓ కిషోర్ కుమార్, డిఎస్పీ నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube