సూర్యాపేట జిల్లా: సూర్యాపేట పట్టణంలో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు ఈదుల యాదగిరి డిమాండ్ చేశారు.తన కూతురు కల్యాణ లక్ష్మి పథకానికి సంబంధించిన అప్లికేషన్ల విషయంలో ఆర్ఐ సంప్రదించగా 5000 రూపాయలు ఇస్తేనే మీ పని తొందరవుతుందని లేనిపక్షంలో ఆలస్యం అవుతుందని ఆర్ఐ శ్రీధర్ తనతో స్వయంగా చెప్పినట్లు ఈదుల యాదగిరి శుక్రవారం సాయంత్రం తాహాసిల్దార్ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు.ఇంతేకాకుండా గతంలో శ్రీధర్ విఆర్ఓగా పనిచేసినప్పుడు తనకు సంబంధించిన వ్యక్తి వద్ద రూ.2500 లంచం తీసుకున్నాడని,దానికి తానే ప్రత్యక్ష సాక్షినని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని సదుద్దేశంతో ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం ఇలాంటి అధికారులు తీరుతో అబాసుపాలై,ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంబంధిత ఉన్నత స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఆర్ఐ శ్రీధర్ లాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్ఐ శ్రీధర్ విఆర్ఓగా ఉన్నప్పుడు ఎంతో మంది వద్ద ఇలా లంచాలకు పాల్పడ్డాడని తన దృష్టికి వచ్చిందని యాదగిరి తెలిపారు.సమాజంలో కాస్త కూస్తో రాజకీయ అవగాహన ఉండి ఒక నాయకుడిగా కొనసాగుతున్న తన వద్దని ఇలా పాల్పడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఈదుల యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు.