సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కంటే కూడా సోషల్ మీడియాలో కాంట్రవర్సీల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు నటి పూనం కౌర్( Poonam Kaur ).ఈమె పలు సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఇతర సినిమాలలో హీరో చెల్లెలు పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇకపోతే ఈమె సినిమాలలో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాల గురించి కూడా పోస్టులు చేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు.

ఇక ఈమె పోస్ట్ చేస్తే ఎవరిని ఉద్దేశించి చేసిందనే విషయం కూడా తెలియకుండా పోస్టులు చేస్తుంటారు.గత కొంతకాలంగా ఏపీ ఎన్నికల( Ap Elections ) గురించి ఈమె సంచలనమైన పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.కుట్రలు మోసాలతో గెలవడం కంటే యోధునిగా ఓడిపోవడం మేలు అంటూ ఈమె పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.ఇక ఈమె పోస్ట్ చూస్తే ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల గురించే ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది.

గత ఎన్నికలలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈసారి 11 సీట్లకే పరిమితమైంది.ఇక కూటమికి ఏకంగా 164 సీట్లు రావడంతో ఏదో జరిగిందని మోసం కారణంగానే ఇలా కూటమికి అధిక సీట్లు వచ్చాయి అంటూ చర్చలు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఈవీయంలు కూడా టాంపరింగ్ చేశారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఈ విధమైనటువంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈమె పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని ఉద్దేశిస్తూ గతంలో కూడా పరోక్షంగా ఎన్నో పోస్టులు చేస్తూ ఆయనపై కౌంటర్లు ఇచ్చారు.
ఈ క్రమంలోనే మరో సారీ ఈమె పోస్ట్ చేయడంతో తప్పకుండా ఏపీ అధికార ప్రభుత్వాన్ని ఉద్దేశించే ఇలాంటి పోస్ట్ చేశారని తెలుస్తోంది.